దుల్కర్‌కు జోడీగా... | Sai Pallavi to Star Opposite Dulquer Salmaan in Upcoming Telugu Film | Sakshi
Sakshi News home page

దుల్కర్‌కు జోడీగా...

Nov 3 2024 3:43 AM | Updated on Nov 3 2024 3:43 AM

Sai Pallavi to Star Opposite Dulquer Salmaan in Upcoming Telugu Film

దుల్కర్‌ సల్మాన్, సాయి పల్లవి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కనుంది. దుల్కర్‌ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో అధికారికంగా ప్రకటించారు. కానీ దుల్కర్‌ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు.

ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్‌. మరి... దుల్కర్‌–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement