అప్పుడు ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది! | Sai Pallavi about Siva Karthikeyan Amaran movie | Sakshi
Sakshi News home page

అప్పుడు ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది!

Oct 26 2024 3:16 AM | Updated on Oct 26 2024 3:16 AM

Sai Pallavi about Siva Karthikeyan Amaran movie

నటనకు ప్రాధాన్యం ఉండే, మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు సాయిపల్లవి. దక్షిణాదిలో తనకంటూ ఎంతో గుర్తింపు, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కాగా శివ కార్తికేయన్‌ హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ‘అమరన్‌’ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ... బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేశారు. తరచూ వార్తల్లో నిలవడం కోసం మీరు పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారు. పీఆర్‌ టీమ్‌ వల్ల తరచుగా వార్తల్లో ఉండగలను... అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. 

అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు ఎలాగూ నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అప్పుడు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ నా గురించి మాట్లాడుకుంటారు. సినిమా రిలీజ్‌ తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నిత్యం నా గురించి మాట్లాడితే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది.. విసుగొస్తుంది.. అందుకే నేను పీఆర్‌ టీమ్‌ వద్దని చెప్పాను’’ అంటూ సాయి పల్లవి చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement