మా సినిమా చేనేత కార్మికులకు అంకితం : సాయి కుమార్‌ | Sai Kumar Talk About Joruga Husharuga Movie | Sakshi
Sakshi News home page

మా సినిమా చేనేత కార్మికులకు అంకితం : సాయి కుమార్‌

Dec 13 2023 10:45 AM | Updated on Dec 13 2023 12:32 PM

Sai Kumar Talk About Joruga Husharuga Movie - Sakshi

‘‘జోరుగా హుషారుగా’లో చేనేత కార్మికుడిగా నటించడం నా అదృష్టం. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి చక్కగా చూపించాడు అను ప్రసాద్‌. ఈ చిత్రాన్ని చేనేత కార్మికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు సాయి కుమార్‌. విరాజ్‌ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అను ప్రసాద్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. నిరీష్‌ తిరువీధుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ– ‘‘బెక్కం వేణుగోపాల్‌గారు కొత్త దర్శకులను, కొత్త కథలను, చిన్న సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. ‘జోరుగా హుషారుగా’ సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు.

‘‘ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్‌ ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగో΄ాల్‌. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు విరాజ్‌ అశ్విన్‌. ‘‘ఇది నా మొదటి చిత్రం’’ అన్నారు అను ప్రసాద్‌. ‘‘సినిమా రిలీజ్‌కి బెక్కం వేణుగో΄ాల్‌గారు అందించిన స΄ోర్ట్‌ మర్చి΄ోలేను’’ అన్నారు నిరీష్‌ తిరువీధుల.  

Advertisement
 
Advertisement
Advertisement