'ప్రణయ గోదారి' మూవీ.. సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ | Sai Kumar Look From Pranaya Godari Movie | Sakshi
Sakshi News home page

'ప్రణయ గోదారి' మూవీ.. సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

Jul 5 2024 9:24 PM | Updated on Jul 5 2024 9:24 PM

Sai Kumar Look From Pranaya Godari Movie

తెలుగులోని భిన్నమైన నటుల్లో సాయి కుమార్ ఒకరు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇప్పుడు మ‌రో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఈయన లేటెస్ట్ మూవీ 'ప్ర‌ణ‌య‌ గోదారి'. ఇందులో పెద‌కాపు అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ పోషించారు. తాజాగా సాయికుమార్ ఫస్ట్ లుక్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)

ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ మూవీతో అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌. 'చూడ‌గానే గంభీరంగా క‌నిపించే లుక్‌, మీస‌క‌ట్టు, తెల్ల‌ని పంచె, లాల్చీతో, మెడ‌లో రుద్రాక్ష‌మాల‌, చేయికి కంక‌ణం, చేతిలో సిగార్‌తో చాలా డిఫరెంట్‌గా సాయికుమార్ కనిపించారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement