Rumour! Prabhas To Take A Long Break From Shooting For A Surgery - Sakshi
Sakshi News home page

Prabhas: మోకాలి నొప్పితో బాధ పడుతున్న ప్రభాస్‌.. త్వరలోనే సర్జరీ?

Aug 12 2023 1:47 PM | Updated on Aug 15 2023 1:36 PM

Rumour: Prabhas To Take A Long Break From Shooting For A Surgery - Sakshi

ప్రభాస్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు...డాన్సులతో కూడా దుమ్మురేపుతాడు.కానీ అలా ప్రభాస్ దుమ్ములేపి చాలాకాలం అయ్యింది.దానికి కారణం కేవలం ప్రభాస్ ఎంచుకుంటున్న పాన్ ఇండియా సినిమాలే కాదు, ప్రభాస్ ని వదలకుండా వేధిస్తున్న మోకాలినొప్పి సమస్య కూడా. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. అందుకే ఈ మధ్య సినిమాల్లో ఎటూ డాన్సుల అవసరం లేదు కాబట్టి డాన్సులకు దూరంగా ఉంటున్నాడు. 

(చదవండి: ‘జైలర్‌' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్‌ రచ్చ)

అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు  సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్,  'కల్కి 2898 ఏడీ' సినిమాలో కూడా పెద్దగా డాన్సులకు స్కోప్ లేదు...ఆ అవసరం కూడా లేదు. ఆ కథలు అలాంటివి. జస్ట్ ప్రభాస్ కటౌట్ నిలబడితే చాలు అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తాడు ప్రశాంత్ నీల్. ఇక  కల్కి 2898 పూర్తిగా స్టోరీ డ్రివెన్  సినిమా.   

(చదవండి: ‘భోళా శంకర్‌’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్‌.. ఎన్ని కోట్లంటే..)

మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అది పూర్తిగా కమర్షియల్ టచ్ ఉన్న సినిమా. ప్రభాస్ కామెడీ,ఫైట్స్ తో పాటు డాన్సులు కూడా ఉండాలి.ఉంటేనే మజా.ఆ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని అంటున్నారు.  కనీసం రెండింటిలోనైనా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. చేయాలని ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అందుకే సలార్, కల్కి 2898 చిత్రాల షూటింగ్ పూర్తవగానే సర్జరీ చేయించుకుని రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటాడట రెబల్ స్టార్. ఇక ఆ తరువాత ఎప్పటిలానే దుమ్ము లేచిపోవడం ఖాయం. 

Advertisement
 
Advertisement
Advertisement