
యాంకర్ సుమకు మీ సినిమాలో చేస్తే ఏ రోల్ ఇస్తారని కీరవాణి ప్రశ్నించగా తారక్.. ఆమెకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ రోల్ ఇవ్వాలన్నాడు. సుమకు చాదస్తం ఎక్కువని, నోరేసుకుని పడిపోతుందని, ఆమె చూడగానే గయ్యాలి అత్త పాత్ర
MM Keeravaani Chit Chat with NTR and Ram Charan: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. తాజాగా తారక్, చెర్రీలను సంగీతదర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరోలిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కీరవాణి కంపోజ్‌చేసిన పాటల్లో భీమవరం బుల్లోడా పాలు కావాలా.. సాంగ్ అస్సలు నచ్చదన్నాడు ఎన్టీఆర్. ఫేవరెట్ సింగర్ ఎవరన్న ప్రశ్నకు మోహన భోగరాజు, గీతామాధురి గొంతు నచ్చుతుందన్నాడు. యాంకర్ సుమకు మీ సినిమాలో ఏ రోల్ ఇస్తారని కీరవాణి ప్రశ్నించగా దీనికి తారక్ స్పందిస్తూ.. ఆమెకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ రోల్ ఇవ్వాలన్నాడు. సుమకు చాదస్తం ఎక్కువని, నోరేసుకుని పడిపోతుందని, ఆమెను చూడగానే గయ్యాలి అత్త పాత్ర గుర్తొస్తుందని అన్నాడు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. సుమకు పంచాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇవ్వాలన్నాడు.