
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు. స్వామి మాలలోనే ఆయన అమెరికాకు వెళ్లాడు. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ కార్యక్రమానికి సూమారు 20 రోజులు ముందుగానే రామ్ చరణ్ అమెరికాకు వెళ్లడం గమనార్హం.
ఇంతకు ముందు గొల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం చరణ్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు అక్కడి ప్రేక్షకుల నుంచి ఆయనకు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పుడు మరోసారి ఆమెరికాకు వెళ్లిన చరణ్ కోసం అక్కడ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనతో ముచ్చటించడానికి ఎదురు చూస్తున్నారు.
కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. దాని కోసమే చిత్ర యూనిట్ అమెరికాకు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, రాజమౌళి కూడా అమెరికాకు వెళ్లనున్నారట.