మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్ | Sakshi
Sakshi News home page

Ram Charan: 'ఆర్ఆర్ఆర్' స్టార్ చరణ్‌కు ఇంటర్నేషనల్ అవార్డ్

Published Sat, Dec 9 2023 8:46 PM

RRR Actor Ram Charan Got Pop Golden Award 2023 - Sakshi

మెగాహీరో రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఆ  తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట చరణ్ ని అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా అలా అమెరికాలో నిర్వహించే ఓ క్రేజీ అవార్డు ఇప్పుడీ మెగాహీరోకి దక్కింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!)

అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కి మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డుల్లో భాగంగా ఈసారి రామ్ చరణ్.. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్.. 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా వచ్చేలోపు చరణ్‌ని ఇంకెన్ని అవార్డులు వరిస్తాయనేది చూడాలి.

(ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!)

Advertisement
 
Advertisement
 
Advertisement