
ఈ ఏడాది సినీజనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కాంతార ప్రీక్వెల్ ఒకటి. 2022లో వచ్చిన కాంతార మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా వస్తోంది కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie). రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది.
కాంతార చూడాలంటే..
అయితే కాంతార చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మద్యం సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు, మాంసం తినకూడదు. కాంతార చూసేవరకు వీటిని కచ్చితంగా ఫాలో అవండి అన్నది ఆ పోస్ట్ సారాంశం. అయితే అది ఫేక్ ప్రచారమని కొట్టిపాడేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిష్టం వారిది.
డిలీట్ చేశారు
కొందరు ఫేక్ పోస్ట్ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది. అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూప్‌కు పంపించాను. ఆ పోస్ట్ చూశాక వెంటనే స్పందించలేకపోయాం. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ ఫేక్ పోస్ట్ చేసినవారు దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి తెలిపాడు.
చదవండి: బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు ట్రోలింగ్?