దయచేసి నన్ను ఫాలో కావొద్దు

Rhea Chakraborty Spotted Buying Flowers In Mumbai - Sakshi

ముంబయి: బాలీవుడ్ నటి రియాచక్రవర్తి బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా చక్రవర్తి పూల బొకే కొనుగోలు చేసింది. రియా చక్రవర్తి కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. దింతో ఆమె వారిని దయచేసి నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.(చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్‌ ఖాన్‌)
 

రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. "అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా" అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top