హీరో పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ మీడియా ముందుకొచ్చారు. వీధి కుక్కల్ని చంపేస్తున్న వాళ్లపై మండిపడ్డారు. రీసెంట్‌గా వీధి కుక్కల బెడదని అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగానే రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టారు. దోమకాటుతో ఏడాదికి 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా? అని ప్రశ్నించారు. అలానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'అన్యాయంగా కుక్కల్ని చంపితే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. కుక్కలన్నీ మంచివే అని నేను చెప్పను. కుక్కల దాడిలో చిన్న బిడ్డలు చనిపోయారు. ఒక తల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేస్తారా? మగాళ్లు రేప్ చేస్తారు, మగాళ్లే మర్డర్లు కూడా చేస్తారు. అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, హంతకులు అంటామా? రేపులు, మర్డర్లు చేసిన మగాళ్లందర్నీ పట్టుకుని చంపేయాలా? బుద్ది ఉందా కొంచెమైనా? ఏడాదికి దోమకాటుతో 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కేవలం కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా?' అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.
(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)
మీలో ఎంత మంది అనాధ ఆశ్రమానికి వెళ్లారు? ఎంత మంది అన్నదానం చేస్తున్నారు? ఎంత మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు? చేసేది ఏమీ లేదు.. పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడతారు? అని రేణు దేశాయ్ రెచ్చిపోయింది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డుపై అడ్డదిడ్డంగా వైన్ షాప్స్ పెడతారు. ఆల్కహాల్ తాగొచ్చి చాలామంది చిన్నపిల్లల్ని చావులకు కారణమవుతున్నారు. వాటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు. చిన్నారుల జీవితానికి విలువ లేదా? కుక్క కరిస్తేనే అడుగుతారా? లక్షలాది మంది ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారు. దానికోసం ఎవరూ పోరాడటం లేదు? కుక్కలు కరిస్తేనే పోరాటాలు చేస్తున్నారు అని ఆవేశానికి లోనైంది.

ప్రతిరోజూ తాను ఎన్నో కుక్కలని కాపాడుతున్నానని.. అంబులెన్సులు వచ్చి వాటి తీసుకెళ్తున్నాయని.. వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని రేణు దేశాయ్ చెప్పారు. కుక్కలు ఇప్పటికే రోజూ యాక్సిడెంట్స్ చాలా చనిపోతున్నాయి. బైక్, బస్, కార్ల వల్ల జరిగే ప్రమాదాల వల్ల కాళ్లు, నడుము విరిగిన కుక్కల్ని చాలాసార్లు కాపాడాను. వాహనదారుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి కంప్లైంట్ చేయలేవుగా అని ప్రశ్నించారు.
(ఇదీ చదవండి: నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ)


