Reasons Behind Vijay Devarakonda Liger Movie Naked Poster, Details Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ నగ్నంగా కనిపించడానికి కారణమిదే!

Jul 2 2022 6:19 PM | Updated on Jul 2 2022 6:24 PM

Reasons Behind Vijay Devarakonda Liger Poster - Sakshi

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనబోయే ఫైటర్‌ల బరువును కొలవడానికి  వారు న్యూడ్‌గా ఉంటారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా శనివారం నాడు హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో విజయ్‌ నగ్నంగా కనిపించడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా! ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనబోయే ఫైటర్‌ల బరువును కొలవడానికి వారు న్యూడ్‌గా ఉంటారు. వారి బరువును గ్రామ్‌లలో కొలవడానికి ఒంటిమీద నూలుపోగు కూడా ఉంచరు. ఈ లీగ్స్‌ను ఫాలో అయ్యేవారికి ఇది బాగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి సింబాలిక్‌గా ఈ పోస్టర్‌ను అలా విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్‌కు ట్రోల్స్‌తో పాటు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పలువురు సెలబ్రిటీలు ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఈ పోస్టర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 1.3 మిలియన్ లైక్స్‌ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి పోస్టర్ ఇదే కావడం మరింత విశేషం.

చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్‌ హీరోయిన్‌
‘పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement