సోషల్‌ టీచర్‌ ఇంగ్లిష్‌ పాఠాలు చెబితే... | Ravi Teja unviels the first look of Sundaram Master | Sakshi
Sakshi News home page

సోషల్‌ టీచర్‌ ఇంగ్లిష్‌ పాఠాలు చెబితే...

Published Fri, Jun 23 2023 5:52 AM | Last Updated on Fri, Jun 23 2023 5:52 AM

Ravi Teja unviels the first look of Sundaram Master - Sakshi


హర్ష చెముడు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్‌’. దివ్య శ్రీ పాద హీరోయిన్‌. కళ్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వంలో రవితేజ, కుర్రు సుధీర్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరో రవితేజ విడుదల చేశారు.

‘‘సోషల్‌ స్టడీస్‌ బోధించే సుందరం మాస్టర్‌ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్‌ టీచర్‌గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్‌ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement