మాస్‌ మహరాజ ‘ఖిలాడీ’ స్టార్ట్‌ | Ravi Teja New Movie Khiladi Starts On Sunday At Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఖిలాడీ’పై క్లాప్‌ కొట్టిన హవీష్‌

Oct 18 2020 1:22 PM | Updated on Oct 18 2020 4:00 PM

Ravi Teja New Movie Khiladi Starts On Sunday At Hyderabad - Sakshi

మాస్‌ మహరాజ్‌ మరో సినిమా షూటింగ్‌కు అప్పుడే రెడీ అయ్యారు. రమేశ్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడీ షూటింగ్‌ ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది.

గోపీచంద్‌ మలినేనితో కలిసి ‘డాన్‌ శీను, బలుపు’ చిత్రాలు చేసిన రవితేజ క్రాక్‌’  సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఇక ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరించే మాస్‌ మహరాజ్‌ మరో సినిమా షూటింగ్‌కు అప్పుడే రెడీ అయ్యారు. రమేశ్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడీ షూటింగ్‌ ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. సినిమా మూహూర్తం షాట్‌కి నటుడు హవీష్‌ క్లాప్‌ కొట్టారు. శ్రీనివాస్‌ రాజు కెమెరా స్విచాన్‌ చేశారు.

ఏ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, పెన్ స్టూడియోస్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ, హవీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మీనా చౌ, డింపుల్‌ హయాతి నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇక రవితేజ విడుదల చేసిన సినిమా పోస్టర్‌లో ఆయన లుక్ మాస్ అండ్ క్లాస్ అభిమానులను ఆక‌ట్టుకునేలా ఉంది. ఆయనకు ఇది 67వ సినిమా కావడం విశేషం.
(చదవండి: ఆటాపాటా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement