'అద్దె ఇంట్లో ఉంటున్నా'.. ప్రియురాలు కావాలంటే తప్పదుగా! | Ravi Mohan Reveals he Living in Rented Home for First Time | Sakshi
Sakshi News home page

Ravi Mohan: విడాకుల తర్వాత అద్దె ఇంట్లో ఉంటున్న స్టార్‌ హీరో

Jun 27 2025 3:37 PM | Updated on Jun 27 2025 4:12 PM

Ravi Mohan Reveals he Living in Rented Home for First Time

3 BHK.. అద్దె ఇంట్లో ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 3BHK. హీరో సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్‌ గురువారం రిలీజైంది. ఈ ఈవెంట్‌కు తమిళ స్టార్‌ హీరో రవి మోహన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

అద్దె ఇంట్లో ఉంటున్నా..
రవి మోహన్‌ (Ravi Mohan) మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో ఉండలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాకు చెందిన ఇళ్లల్లోనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మాత్రం అద్దె ఇంట్లో బతుకుతున్నాను. ఈ సినిమా నా జీవితానికి దగ్గరగా ఉంది. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఈ మూవీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇది జనాలకు అస్సలు మింగుడుపడలేదు. 

ప్రియురాలితో ఉండాలంటే..
'అద్దె ఇంట్లో ఉండటమంటే లక్షలు రెంటు కట్టడం కాదు.. సొంతిల్లు లేక అగచాట్లు పడటం!', 'అయినా ఎందుకీ చెత్తంతా వాగుతున్నావు.. నువ్వు హీరోవి, కోట్లల్లో సంపాదిస్తున్నావు.. అద్దె ఇంట్లో కష్టాలు పడే కూలీలా మాట్లాడకు..', 'నీకు పెళ్లయి భార్య ఉంది, కానీ ఆమెను పక్కనపెట్టి ప్రియురాలు కావాలనుకున్నావ్‌, అలాంటప్పుడు అద్దె ఇంట్లోనే కదా ఉండాల్సింది! సింపతీ కార్డు వాడకు', 'అద్దింట్లో ఉంటున్నావ్‌.. కానీ సినిమాలు నిర్మిస్తున్నావ్‌' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
కాగా రవి మోహన్‌- ఆర్తి దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సింగర్‌ కెనీషాతో ప్రేమాయణమే దంపతుల మధ్య చిచ్చు పెట్టిందన్న రూమర్లున్నాయి. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉండగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. 3 BHK సినిమా విషయానికి వస్తే.. ఆర్‌ శరత్‌కుమార్‌, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా అనుకోలే: మనోజ్‌

Advertisement
 
Advertisement
Advertisement