భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్బంగా ఆయన జీవిత కథతో ‘మా వందే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషించనున్నారని ఇప్పటికే ప్రకటించారు. వీర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రాంతికుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇందులో మోదీ అమ్మగారి పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నారు.

ప్రధాని మోదీకి తన అమ్మగారు హీరాబెన్ అంటే చాలా ఇష్టం. రాజకీయంగా, ప్రధానిగా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే తన పుట్టినరోజును మాత్రం అమ్మ వద్దే జరుపుకునే వారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న బయోపిక్ కూడా ఎక్కువగా మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే రానుంది. ఈ సినిమాకు ఎంతో కీలకమైన ఆ పాత్ర కోసం బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తున్నారు.
కేజీఎఫ్-2 చిత్రంలో ఆమె భారత ప్రధానిగా, శక్తివంతమైన రమికా సేన్ పాత్రలో నటించారు. మోదీ ఎదుగుదల వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ ఏంటి.. తల్లితో మోదీకి ఉన్న అనుబంధం ప్రేక్షకులకు భావోద్వేగాల్ని పంచనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ పాత్రకు రవీనా అయితే న్యాయం చేస్తుందని వారు భావించారు. ఈ సినిమాకి కెమెరామెన్‌గా కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.


