తగ్గేదేలే.. రష్మిక ఖాతాలో మరో సినిమా.. | Rashmika Mandanna To Pair Up With Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. రష్మిక ఖాతాలో మరో సినిమా..

Jul 29 2021 7:50 AM | Updated on Jul 29 2021 8:18 AM

Rashmika Mandanna To Pair Up With Sivakarthikeyan - Sakshi

‘పుష్ప’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మికా మందన్నా ఖాతాలో తాజాగా మరో ప్రాజెక్ట్‌ వచ్చి చేరిందనే టాక్‌ వినిపిస్తోంది. తమిళ నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు రష్మికా మందన్నాను తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావిస్తోందని సమాచారం. రీసెంట్‌గా అనుదీప్, రష్మికల మధ్య కథాచర్చలు కూడా జరిగాయట. మరి... శివ కార్తికేయన్, రష్మికా జోడీ కడతారా? ఈ కొత్త జంట వెండితెరపై కనువిందు చేస్తారా? వేచి చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement