ర‌ణ్‌వీర్ కారుకు ప్ర‌మాదం | Ranveer Singh Met With Small Accident In Mumbai | Sakshi
Sakshi News home page

ర‌ణ్‌వీర్ కారుకు ప్ర‌మాదం

Oct 15 2020 8:51 PM | Updated on Oct 15 2020 9:46 PM

Ranveer Singh Met With Small Accident In Mumbai - Sakshi

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌‌వీర్ సింగ్ కారు స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురైంది. ముంబైలోని ఓ స్టూడియోలో గురువారం డ‌బ్బింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్ర‌యాణం అవుతుండ‌గా ఈ సంఘ‌‌న‌ చోటు చేసుకుంది. ర‌ణ్‌వీర్ మెర్సిడిస్ కారును వెన‌క నుంచి ఓ బైక్ గుద్ద‌డంతో వెంట‌నే హీరో గాబ‌రాగా దిగి ఏమైనా డ్యామేజ్ అయిందేమోన‌ని ప‌రిశీలించారు. అదృష్ట‌వ‌శాత్తూ కారుకు కూడా ఎలాంటి న‌ష్టం చోటు చేసుకోలేదు. దీంతో అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకున్నాక తిరిగి కారెక్కి అక్క‌డ‌నుంచి వెళ్లిపోయారు. (చ‌ద‌వండి: అక్షయ్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి: కేఆర్‌కే)

దీన్నంత‌టినీ కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. ర‌ణ్‌వీర్ క్షేమంగానే ఉన్నార‌ని పేర్కొంటున్నారు. ఇక ‌సినిమాల విష‌యానికొస్తే ర‌ణ్‌వీర్ '83' అనే క్రీడా నేప‌థ్యం గ‌ల చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో ఆయ‌న టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే తెలుగు మాస్ మ‌సాలా చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్' హిందీ రీమేక్‌లో కూడా ఆయ‌న క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. (చ‌ద‌వండి: ఆడిష‌న్స్‌కి ర‌ణ్‌వీర్‌సింగ్ ఎలా వెళ్లాడో చూడండి)

Advertisement
 
Advertisement
Advertisement