
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మర్దానీ 3’. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దసరా నవరాత్రులు శుభారంభం సందర్భంగా ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కుతోంది.
మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి కనిపించబోతున్నారు. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో సినిమాలో చూడాలి’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది.