Ranbir Kapoor Talks About Biggest Mistake He Made on Shamshera Movie - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: ఆ గడ్డమే కొంపముంచింది.. రణ్‌బీర్‌ కామెంట్స్ వైరల్

Dec 9 2022 6:22 PM | Updated on Dec 9 2022 7:24 PM

Ranbir Kapoor talks about biggest mistake he made on Shamshera movie - Sakshi

బాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌. ఈ జంటకు ఇటీవలే ఓ కూతురు జన్మించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ ఏడాది రిలీజైన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే జూలైలో విడుదలైన మూవీ 'షంషేరా' రణబీర్‌ కెరీర్‌లో ఓ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమా ఫ్లాప్‌ కావడానికి గల కారణాన్ని రణ్‌బీర్ వెల్లడించారు.  షంషేరా చిత్రం జూలై 22న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 

రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ.. 'షంషేరా మూవీ ఫెయిల్ కావడానికి మేం చేసిన పొరపాట్లు ప్రధాన కారణం. అందులో నా గడ్డం కూడా ఒకటి. నేను  ఈ చిత్రం కోసం కృత్రిమ గడ్డం పెట్టుకున్నా. ఎండలో షూటింగ్ చేసే సమయంలో అది సరిగా కనిపించలేదు. ముఖానికి అతుక్కుని ఉన్నట్లు కనిపించింది. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిందనుకుంటా.' అని అన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు రణ్‌బీర్‌ కపూర్. ఈ సినిమా వైఫల్యానికి గడ్డమే ప్రధాన కారణం కావచ్చని బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. కాగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌లో  రణబీర్ కపూర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా అతని జోడీగా నటిస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement