Ranbir Kapoor Movie: తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రణ్‌బీర్‌

Ranbir Kapoor Shamshera Movie Details - Sakshi

బ్లాక్‌బస్టర్ "సంజు" సినిమా తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'షంషేరా'. ఈ సినిమా ట్రైలర్‌లో తన నటనతో మరోసారి అబ్బురపరిచాడు రణ్‌బీర్‌. ఈ మూవీలో తండ్రి షంషేరా పాత్రలోనూ, అలాగే తనయుడు బల్లిగా పాత్రలోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడీ బాలీవుడ్‌ హీరో. రణబీర్ ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించడం ఇదే మొదటిసారి. 

షంషేరా కథ విషయానికి వస్తే.. ఇది కల్పిత నగరమైన  కాజాలో జరుగుతుంది. ఇక్కడ అధికార జనరల్ షుద్ సింగ్.. యోధులకు చెందిన కొంతమందిని ఖైదీలుగా, బానిసలుగా మార్చి హింసిస్తుంటాడు. ఇది బానిసగా మారిన వ్యక్తి  నాయకుడిగా ఎదిగే  కథే షంషేరా. అతను తన వాళ్ళ  స్వేచ్ఛ, గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు. అతని పేరు షంషేరా. 

1800 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని దీన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో షంషేరా పాత్రలో నటించిన రణబీర్ కపూర్ గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఇందులో చేశారు! తిరుగుబాటు ఉద్యమం ఉన్న ఈ చిత్రంలో రణబీర్‌కు బద్ధ శత్రువుగా సంజయ్ దత్ నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆదిత్య చోప్రా నిర్మించారు. జూలై 22, 2022న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

చదవండి: సల్మాన్‌ను మా వర్గం ఎప్పటికీ క్షమించదు
విషాదం, దర్శకుడు కన్నుమూత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top