రమేశ్‌ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ | Ramesh Babu Passed Away: Hero Movie Pre Release Event Cancelled | Sakshi
Sakshi News home page

Hero Movie: రమేశ్‌ బాబు మృతి, 'హీరో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌

Jan 9 2022 7:57 PM | Updated on Jan 9 2022 7:59 PM

Ramesh Babu Passed Away: Hero Movie Pre Release Event Cancelled - Sakshi

Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్‌స్టార్‌ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్‌ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

కాగా లవ్‌ అండ్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement