Actor Ram Charan Tests COVID-19 Positive, Under Home Quarantine I రామ్‌ చరణ్‌కి కరోనా పాజిటివ్‌ - Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌కి కరోనా పాజిటివ్‌

Dec 29 2020 7:57 AM | Updated on Dec 29 2020 2:16 PM

Ramcharan Tested Corona Positive - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు‌ ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలిజయజేస్తాను’ అంటూ రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు. (కొత్త విభాగంలో అక్క ఫైటర్‌: రాంచరణ్‌)

ఇక నాలుగు రోజుల క్రితం చరణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్‌ జరుపుకున్నారు. వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాక రెండు రోజుల క్రితం చరణ్‌ ఆచార్య సెట్‌కి వెళ్లారు. డైరెక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్‌ను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరిని పలకరించారు. ఇక ప్రస్తుతం చరణ్‌కి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో వీరందరిలో టెన్షన్‌ మొదలైంది.



Advertisement
 
Advertisement
Advertisement