Pothineni Ram Takes A Small Break From Movies - Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమాలకు బ్రేక్‌ చెప్పిన రామ్‌!

Feb 6 2021 4:07 PM | Updated on Feb 6 2021 5:50 PM

Ram Pothineni Take Small Break From Movies - Sakshi

అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

అభిమానులకు చిన్నపాటి షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ‘రెడ్‌’హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఈ యువ హీరో... తన తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి అప్ డేట్ ఇస్తాడనకుంటే.. సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి  సడన్‌ షాక్‌ ఇచ్చాడు. కారణం ఏంటంటే.. రామ్‌ శివ మాల వేసుకున్నాడు. ఈ మాల ధరిస్తే 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి. అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

శివ మాల ధరించి, గాగుల్స్ పెట్టుకున్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే ఈ బ్రేక్ సినిమాల‌కా..? లేక సోష‌ల్ మీడియాకా..? అన్న‌ది తెలియదు. కాగా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా త‌ర‌చుగా అయ్య‌ప్ప స్వామి మాల‌ను ధ‌రిస్తుంటాడు. ఆ స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంటాడు. మరి రామ్‌ చెర్రీలా కాకుండా 41 రోజుల పాటు దూరంగా ఉంటాడా లేదా సోషల్‌ మీడియాకు మాత్రమే దూరంగా ఉంటారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement