breaking news
shiva maala
-
శ్రీశైలంలో శివ మాల వస్త్రాలు పంచిన ఎమ్మెల్యే
-
షాకింగ్ న్యూస్ చెప్పిన రామ్.. త్వరలో వస్తానంటూ..
అభిమానులకు చిన్నపాటి షాకింగ్ న్యూస్ చెప్పాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ‘రెడ్’హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ యువ హీరో... తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇస్తాడనకుంటే.. సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి సడన్ షాక్ ఇచ్చాడు. కారణం ఏంటంటే.. రామ్ శివ మాల వేసుకున్నాడు. ఈ మాల ధరిస్తే 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి. అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. శివ మాల ధరించి, గాగుల్స్ పెట్టుకున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఓం నమః శివాయ, చిన్న బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వస్తాను’అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ బ్రేక్ సినిమాలకా..? లేక సోషల్ మీడియాకా..? అన్నది తెలియదు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తరచుగా అయ్యప్ప స్వామి మాలను ధరిస్తుంటాడు. ఆ సమయంలో నిబంధనలను పాటిస్తూనే షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంటాడు. మరి రామ్ చెర్రీలా కాకుండా 41 రోజుల పాటు దూరంగా ఉంటాడా లేదా సోషల్ మీడియాకు మాత్రమే దూరంగా ఉంటారో చూడాలి. Om Namah Shivaya! Small break.. I’ll be back!! Love..#RAPO pic.twitter.com/VFrr5Xi9Zk — RAm POthineni (@ramsayz) February 6, 2021 -
చిన్నారి మృతి
కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ విద్యార్థి సోమవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. గ్రామానికి చెందిన రాంమోహన్, లలిత దంపతుల రెండో కుమారుడు అరవింద్ స్థానిక అంగన్వాడీ సెంటర్లో చేర్పించారు. తండ్రి శివ మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం వెళ్లాడు. తల్లి సోమవారం ఽపనులకు వెళ్తూ కుమారుడు అరవింద్ (4)ను అంగన్వాడీ సెంటర్లో వదిలి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్నారి అకస్మాతుగా కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు. అంగన్వాడీ సెంటర్లో విషతుల్యమైన ఆహారం తినడం వల్లే బాలుడు మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తుండగా, మిగతా పిల్లలు కూడా ఆహారం తీసుకున్నా వారికేమి కాలేదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న కోడుమూరు తహసీల్దార్ నిత్యానందరాజు, ఎస్ఐ మహేష్‌కుమార్, ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మలాదేవి గోరంట్ల చేరుకొని బాలుడి మృతికి గల కారణాలపై ఆరా తీశారు.