Ram Gopal Varma's Murder Movie Ready To Release On Theaters | థియేటర్లలో చంపడానికి రాబోతుంది - Sakshi
Sakshi News home page

థియేటర్లలో చంపడానికి రాబోతుంది: ఆర్జీవీ

Dec 8 2020 12:06 PM | Updated on Dec 8 2020 12:55 PM

Ram Gopal Varma Share Update For Release Of Murder Movie - Sakshi

యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల తెరకెక్కెంచిన సినిమా ‘మర్డర్‌’. ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని, త్వరలో థియేటర్లకు వస్తుందని ఆర్జీవీ తెలిపారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌ మూవీని నిర్మించాడని ట్రైలర్‌, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని ఆమృత తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నల్గొండలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ ‘మర్డర్‌’ చిత్ర తెరకెక్కించినట్లు చిత్రం ట్రైలర్‌, పాటను చూస్తే అర్థమవుతోంది. దీంతో మర్డర్‌ సినిమా విడుదల నిలిపివేయాలని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి  నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ను కోర్టు ఆదేశించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను రామ్‌గోపాల్‌​ వర్మ తన ట్విటర్‌ ఖాతాలో​ అభిమానులతో పంచుకున్నారు. చదవండి: అరియానాతో సినిమా తీస్తా: రామ్ గోపాల్ వ‌ర్మ‌

మర్డర్‌ సినిమా విడుదలకు సంబంధించిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ను ఆయన పోస్ట్‌ చేశారు. అదే విధంగా ‘మర్డర్‌ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపో​యాయి. ఇక థీయేటర్లలో చంపడానికి ‘మర్డర్‌’ సినిమా త్వరలోనే రాబోతుంది’అని ఆయన కాప్షన్‌ జతచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌, పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన ఆ పాటను ఆర్జీవీ పాడటం విశేషం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు. చదవండి: ఆసక్తి రేపుతున్న ‘కరోనా వైరస్‌’ రెండో ట్రైలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement