అందుకే రణ్‌వీర్‌ నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేశాడేమో: ఆర్జీవీ

Ram Gopal Varma Response On Ranveer Singh Shirtless Photoshoot - Sakshi

ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేయించుకున్నాడు. ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయింది. దీనిని  కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్‌వీర్‌ ఇలా ఫోటో షూట్‌ చేసి ఉండోచ్చని అభిప్రాయపడ్డాడు. 

(చదవండి: పవన్‌తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?)

మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది.. పురుషులు ఎందుకు అలా చూపించొద్దని ప్రశ్నించాడు. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా.. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్‌ క్వశ్చన్‌ కూడా పెట్టాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top