ఏళ్లకు ఏళ్లు ఎదురుచూపులు.. పవన్‌ తీరుతో భయపడుతున్న దర్శకులు!

Reasons Behind Why Pawan Kalyan Upcoming Movies Not Going Forward - Sakshi

ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. 

గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్‌ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్‌ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్‌ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

(చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..)

మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు.

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్‌ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్‌ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top