'పవర్‌ స్టార్‌'పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ | Ram Gopal Varma Promotions on Powerstar Movie - Sakshi
Sakshi News home page

పవర్‌ స్టార్‌పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ

Jul 24 2020 3:38 PM | Updated on Jul 24 2020 5:04 PM

Ram Gopal Varma Promotions For Power Star Movie - Sakshi

హైదరాబాద్‌ : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’‌. ఈ చిత్రాన్ని జూలై 25 ఉదయం 11 గంటలకు ఆర్టీవీవరల్డ్‌థియేటర్‌. కామ్‌లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ‘గడ్డి తింటావా’ సాంగ్‌కు, ట్రైలర్‌కు భారీగా వ్యూస్‌ వచ్చాయి. తాజాగా విడుదలకు మరికొన్ని గంటలు ఉందనగా.. ఆర్జీవీ తనదైన శైలిలో ప్రమోషన్‌ను ప్రారంభించారు.(వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి)

ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన..  వాటికి ఆసక్తికర క్యాప్షన్స్‌ కూడా ఇచ్చారు. ఎవరు మాట్లాడుతున్నారో గెస్‌ చేయండి?, వాళ్లు బ్రదర్సేనా?, చెక్‌ దిస్‌ క్యారెక్టర్‌.. అంటూ పోస్ట్‌లు చేశారు. ఇవన్నీ కూడా సినిమాపై  మరిన్ని అంచనాలు పెంచేలా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి వ్యతిరేకంగా పలువురు జనసేన కార్యకర్తలు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. (ఐదు భాషల్లో ‘మర్డర్‌’ : ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement