Ram Gopal Varma 'Edo Jarigey' Song From 'Sagileti Katha' Movie - Sakshi
Sakshi News home page

ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది: రామ్‌గోపాల్‌ వర్మ

Aug 19 2023 4:25 AM | Updated on Aug 19 2023 10:31 AM

Ram Gopal Varma Comments On Sagileti Katha Movie - Sakshi

‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్‌ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం  విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్‌ జంటగా రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్‌ సి–స్పేస్‌ సమర్పణలో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి నిర్మించారు.

జశ్వంత్‌ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్‌ని రామ్‌గోపాల్‌ వర్మ రిలీజ్‌ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్‌ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్‌ సుద్మూన్‌. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్‌ మిట్టపల్లి. సి స్పేస్‌ కో ఫౌండర్‌ పవన్‌ మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement