వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు! | Sakshi
Sakshi News home page

వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!

Published Wed, Jan 3 2024 2:59 PM

Ram Gopal  - Sakshi

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం రిలీజ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సినిమాపై సింగిల్‌బెంచ్‌లోనే తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8వ తేదీనే పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును దాసరి కిరణ్‌కుమార్‌ సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. 

కాగా.. వ్యూహం  సినిమా‌కు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని.. ఏపీ రాజకీయాలను ప్రభావం చేసేలా సినిమా ఉందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈ నెల 11వ తేదీ సినిమా రిలీజ్‌ చేయవద్దంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement