Ram Charan Interesting Tweet On Jr NTR - Sakshi
Sakshi News home page

నా బ్రదర్‌ ఎన్టీఆర్‌ అంటూ రామ్‌ చరణ్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

Feb 25 2023 1:27 PM | Updated on Feb 25 2023 2:50 PM

Ram Charan Interesting Tweet On NTR - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈ సినిమా పేరు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతుంది. సినిమాకు సంబంధి ఎలాంటి అవార్డులు ప్రకటించినా.. ఆ లిస్ట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుంది. తాజాగా ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డులు ప్రకటిస్తే.. అందులో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సత్తా చాటింది. బ్లాక్‌ పాంథర్‌, ది వుమెన్‌ కింగ్‌, ది బ్యాట్‌ మ్యాన్‌ వంటి హాలీవుడ్‌చిత్రాలను వెనక్కి నెట్టి..‘ బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌’,  ‘బెస్ట్‌ స్టంట్స్‌’, బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.  

దీంతో పాటు  ‘క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డు’లో యాక్షన్‌ మూవీ విభాగంలో ఉత్తమ నటుడు కేటగిరీ విభాగంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ స్టార్స్‌ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రామ్‌ చరణ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌ లాంటి దిగ్గజ నటులతో పాటు నా పేరు, నా బ్రదర్‌ ఎన్టీఆర్‌ పేరు కలిసి చూడడం ఆనందంగా ఉంది’ అని చరణ్‌ ట్వీట్‌ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌ పాత్రకు మంచి రెస్పాన్స్‌ రావడంతో.. ఈ సారి ఆ అవార్డు పక్క రామ్‌ చరణ్‌కు వస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement