Hero Ram Charan Inspiring Afternoon With BSF Jawans In Amritsar, Photos Viral - Sakshi
Sakshi News home page

Ram Charan - Jawans: జవాన్లతో రామ్‌చరణ్‌ ఫొటోలు

Apr 20 2022 12:11 PM | Updated on Apr 20 2022 1:13 PM

Ram Charan Inspiring Afternoon With BSF Jawans In Amritsar - Sakshi

మంగళవారం షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రేంజ్‌ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అతడి యాక్టింగ్‌ స్కిల్‌ను జనాలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం చెర్రీ శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు.

ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: అంటే సుందరానికీ టీజర్‌ చూశారా? ఫుల్‌ ఫన్‌ గ్యారంటీ!

 ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

Advertisement
 
Advertisement
Advertisement