Ante Sundaraniki Teaser: Nani, Nazriya Film Ante Sundaraniki Teaser Out Now - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki: అంటే సుందరానికీ టీజర్‌ చూశారా? ఫుల్‌ ఫన్‌ గ్యారంటీ!

Apr 20 2022 11:09 AM | Updated on Apr 20 2022 11:38 AM

Nani, Nazriya Film Ante Sundaraniki Teaser Out Now - Sakshi

సుందర్‌ ప్రసాద్‌ మీ అబ్బాయే కదండీ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. గండాలు ఉన్నాయంటూ హీరోతో పూజల మీద పూజలు చేయించడమే కాక ఏకంగా నాలుకకు వాత పెట్టే సన్నివేశాలు బాగున్నాయి.

నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి బుధవారం టీజర్‌ రిలీజైంది.

సుందర్‌ ప్రసాద్‌ మీ అబ్బాయే కదండీ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. గండాలు ఉన్నాయంటూ హీరోతో పూజల మీద పూజలు చేయించడమే కాక ఏకంగా నాలుకకు వాత పెట్టే సన్నివేశాలు బాగున్నాయి. పక్కా ఆచారి అయిన హీరో సుందర్‌.. క్రైస్తవ అమ్మాయి లీలాను ప్రేమించడంతో అసలు కథ మొదలైనట్లు తెలుస్తోంది. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అసలు వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్‌ 10న థియేటర్లలో రిలీజవుతోంది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే?

Advertisement
 
Advertisement
Advertisement