Ram Charan Celebrates His Birthday On RC15 Sets See Pics - Sakshi
Sakshi News home page

Ram Charan : గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు సర్‌ప్రైజ్‌.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ షురూ..

Mar 26 2023 10:50 AM | Updated on Mar 26 2023 12:29 PM

Ram Charan Celebrates His Birthday On RC15 Sets See Pics - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సెస్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది.

ఇక రేపు(సోమవారం)రామ్‌చరణ్‌ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్‌లో యూనిట్‌ సభ్యుల మధ్య రామ్‌చరణ్‌ తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

చరణ్‌ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్‌కట్‌ చేయించారు. ఈ వేడకలో శంకర్‌, దిల్‌రాజు, కియారాలతో పాటు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement