రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా, సిమ్రత్ కౌర్, సట్న టీటస్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’. సీహెచ్ సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి సుధీర్, డా. రవి బాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాను. ప్రేక్షకులకు మా సినిమా నచ్చేలా ఉంటుంది’’ అని తెలిపారు.
సందీప్ మాధవ్ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సందీప్ మాధవ్ అన్నారు. ‘‘1980 నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అని సీహెచ్ సుధీర్ రాజు చెప్పారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం కష్టపడి పని చేశారు’’ అన్నారు స్వాతి సుధీర్. ‘‘మా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రవి బాల.


