Jailer Box Office Collection Day 1: Rajinikanth Movie Breaks Many Records - Sakshi
Sakshi News home page

Jailer Box Office Collection Day 1: రజనీకాంత్‌ 'జైలర్‌' మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Aug 11 2023 11:49 AM | Updated on Aug 11 2023 12:42 PM

Rajinikanth Jailer First Day Collections - Sakshi

వీకెండ్‌ కాకపోయినా అన్ని కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్‌. ఇక తొలి రోజు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో

సక్సెస్‌ కోసం రజనీకాంత్‌.. రజనీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. జైలర్‌ చిత్రంతో వీరి కల నిజమైంది. తలైవా స్టైల్‌, యాక్షన్‌, డైలాగ్‌ డెలివరీకి అభిమానులు ముచ్చటపడిపోతుంటే.. పాజిటివ్‌ టాక్‌ రావడంతో రజనీ పండగ చేసుకుంటున్నాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది.

ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.24 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. కేరళలో రూ.6 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో చెరో రూ.5 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్స్‌ రాగా.. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.75-85 కోట్ల మేర సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్‌ కాకపోయినా ఇన్ని కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్‌. కొందరు హీరోలకు ఇవి లైఫ్‌టైమ్‌ వసూళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి రోజు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా బాలేదని నెగెటివ్‌ రివ్యూ ఇచ్చిన ఇద్దరినీ చెన్నైలో చితక్కొట్టారు.

సోషల్‌ మీడియా ప్రచారం ఎలా ఉన్నా మౌత్‌ టాక్‌తో సినిమాకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మోహన్‌ లాల్‌, శివ రాజ్‌కుమార్‌, యోగిబాబు, రమ్యకృష్ణ తమన్నా, సునీల్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. ఇతడి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది.

చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement