ఎక్స్‌ట్రాలోకి స్వాగతం | Rajasekhar entry in Nitin extra movie | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రాలోకి స్వాగతం

Published Tue, Oct 17 2023 3:42 AM | Last Updated on Tue, Oct 17 2023 3:42 AM

Rajasekhar entry in Nitin extra movie - Sakshi

ఎన్నో విలక్షణమైన పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి, వారి హృదయాల్లో తనదైన స్థానం సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్‌ ‘ఎక్స్‌ ట్రా– ఆర్డినరీ మేన్‌ ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. నితిన్‌ , శ్రీలీల జంటగా  వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మేన్‌ ’ చిత్రం తెరకెక్కుతోంది.

శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్, రుచిర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాజశేఖర్‌ నటిస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆయన సెట్స్‌లోకి అడుగు పెట్టగా, మేకర్స్‌ స్వాగతం పలికారు. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ‘ఎక్‌ ్సట్రా’  రూపొందుతోంది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని పాత్రను నితిన్‌ ఈ సినిమాలో చేస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ మూవీ డిసెంబరు 8న విడుదలకానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement