రిలీజ్‌కు సిద్ధమైన ప్రేమకథా చిత్రం 'రాజ్ కహాని' | raj kahani Movie Released On March 24th | Sakshi
Sakshi News home page

Raj Kahani: విడుదలకు సిద్ధమైన ప్రేమకథ 'రాజ్ కహాని'

Mar 15 2023 9:34 PM | Updated on Mar 15 2023 9:34 PM

raj kahani Movie Released On March 24th - Sakshi

ప్రేమకథ ఇతివృత్తంగా రాజ్ కార్తికేన్ హీరోగా నటించిన చిత్రం  'రాజ్ కహాని'. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 24 న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.  

చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 24 న ప్రేక్షకుల ముందుకొస్తుంది . ఈ సంధర్భంగా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.. 

హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకముంది.' అని అన్నారు. నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు మాట్లాడుతూ..'మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేశాం. యూత్, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.' ‍అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement