Rahul Dev: దక్షిణాదిలో ఇప్పటికీ అదే ట్రెండ్‌ నడుస్తోంది: రాహుల్ దేవ్

Rahul Dev says south films still follow the template of 70s and 80s - Sakshi

దక్షిణాది సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నటుడు రాహుల్ దేవ్. ఇప్పటికీ వారు ఇంకా 1970-80ల్లో వచ్చిన ధోరణినే అనుసరిస్తున్నాయని అన్నారు. వారు చూపించేవి నిజ జీవితంలో జరగపోయినా.. దక్షిణాది సినిమాలు బాగానే నడుస్తున్నాయని రాహుల్ దేవ్ చెప్పారు. ఇటీవల ఆవ్న గ్యాస్‌లైట్‌ అనే క్రైమ్ థిల్లర్‌లో కనిపించారు. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సారా అలీ ఖాన్, చిత్రాంగద సింగ్, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాహల్‌ను.. బాలీవుడ్‌తో పోలిస్తే ఎక్కువ ప్రాంతీయ చిత్రాలలో నటించడంపై ప్రశ్నించారు. దీంతో రాహుల్ దేవ్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తనను చాలా తక్కువగా ఉపయోగించుకుందని అన్నారు. అయితే టాలీవుడ్‌ పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు రాహుల్ దేవ్.

రాహుల్ మాట్లాడుతూ.. 'సృజనాత్మకతను ఏ విధంగానైనా చెప్పొచ్చు. మీరు దక్షిణాది వైపు చూస్తే, వారి సినిమాలు బాగా ఆడుతున్నాయి, కానీ అవన్నీ 1970- 80ల చిత్రాల ధోరణినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అప్పటీ కథనే మళ్లీ చెబుతున్నారు. వారి డైలాగ్‌లు, నటీనటుల జీవితం కంటే పెద్దవి. కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. కానీ కథ పాతదే అయినా అదే కథను చెప్పే విధానం.. ప్రేక్షకులను మెప్పించడం చాలా ముఖ్యం. కాబట్టి కథను వ్యక్తీకరించిన విధానం, ఆడియన్స్ దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ముఖ్యం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నా'. అని అన్నారు.

తన నటన జీవితంపై మాట్లాడుతూ..' ఓటీటీలతో ప్రస్తుత నటుడి నైపుణ్యం చాలా సహజంగా మారిపోయింది. ఉదాహరణకు నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మధ్య ఫైటింగ్ జరుగుతోంది. అందులో ఎవరిదీ తప్పు అని మనం నిర్ణయిస్తాం. అదే సినిమా విషయాకొనిస్తే అదే ఎక్కువమంది ఇష్టపడతారు. సినిమాల్లో అదే ఫైట్‌ను ఆ ధోరణితో చూడరు. అంటే సృజనాత్మకత ఒక వ్యక్తీకరణ మాత్రమే. ఇది మీరు ఏ విధంగానైనా వ్యక్తీకరించవచ్చు.' అని అన్నారు.  కాగా.. ఛాంపియన్, ఓంకార, టోర్బాజ, రాత్ బాకీ హై వంటి చిత్రాలలో రాహుల్ నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్‌తో కలిసి కన్నడ చిత్రం కబ్జాలో కూడా కనిపించారు. ఇందులో ఉపేంద్ర, శ్రియ శరణ్ కూడా నటించగా.. ఈ చిత్రం గత నెలలోనే విడుదలైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top