ప్రత్యేక అతిథిగా... | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అతిథిగా...

Published Thu, Jun 8 2023 6:05 AM

Radhika Apte to play special cameo in Vijay Sethupathi Merry Christmas - Sakshi

విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ల వెండితెర క్రిస్మస్‌ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్‌ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’లో విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం.

హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్‌కి రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్‌’, ‘అంథాధూన్‌’లో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement