'ఆహా'లో పుష్పక విమానం, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే! | Pushpaka Vimanam Streaming On AHA From December 10 | Sakshi
Sakshi News home page

Pushpaka Vimanam: పుష్పక విమానం ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

Dec 1 2021 5:20 PM | Updated on Dec 1 2021 5:22 PM

Pushpaka Vimanam Streaming On AHA From December 10 - Sakshi

పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Pushpaka Vimanam In AHA: దొరసాని, మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. ఇటీవలే పుష్పక విమానంతో ప్రేక్షకులను పలకరించాడీ యంగ్‌ హీరో. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

నవంబర్‌ 12న రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ట్రాక్‌ ఎక్కింది. డిసెంబర్‌ 10 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్సయినవారు ఎంచక్కా ఇంట్లోనే ఆహా యాప్‌లో చూసేయొచ్చు. ఇక ఈ చిత్రంలో గీత్‌ సైనీ, శాన్వీ మేఘన, సునీల్‌, నరేశ్‌, హర్థవర్దన్‌ తదితరులు నటించారు. దామోదర దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం అందించగా హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement