'లోడు దింపతాండాం'.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగే‌

Pushpa Update: Allu Arjun As PushpaRaj Look Reveals On Spril 7th - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారు. అయితే ఫస్ట్‌లుక్‌‌, రిలీజ్‌ డేట్‌ పోస్టర్లను మినహాయించి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ను మూవీ టీం రివీల్‌ చేయలేదు. దీంతో పుష్ప అప్‌డేట్స్‌ కోసం బన్నీ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. పుష్ప సినిమా నుంచి ఓ మాస్‌ అప్‌డేట్‌ని మూవీ టీం షేర్‌ చేసింది. బన్నీ బర్త్‌డేకు ఒకరోజు ముందుగా, అనగా ఈనెల 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ వారం 'పుష్ప' చిత్రం నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది.

"లోడు దింపతాండాం" అంటూ చిత్తూరు యాసలో ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పంచుకోడంతో బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. షరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి : పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు‌
పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top