పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు

Allu Arjun Spending 4 Hours a day to Tan His Skin - Sakshi

బాగా ఎండల్లో తిరిగినప్పుడు చర్మం రంగు మారిపోతుంది. స్కిన్‌ ట్యాన్‌ అయిపోతుంది. నల్లగా మారుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ చర్మం అలానే మారింది. అయితే ఇది మేకప్‌ మాయ. ‘పుష్ప’ సినిమాలో లారీ క్లీనర్‌ పాత్ర చేస్తున్నారు అల్లు అర్జున్‌. అసలు సిసలైన క్లీనర్‌గా కనబడటానికి ప్రత్యేకంగా మేకప్‌ చేయాల్సి వస్తోంది. షూటింగ్‌ ఉన్న ప్రతిరోజూ రెండు గంటలు మేకప్‌కి పడుతోంది.

తీయడానికి గంటన్నర పడుతోంది. కనుబొమ్మలు, జుట్టు, మీసాలు, చర్మం రంగు.. ఇలా పత్రిదానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేకప్‌ చేస్తున్నారు. అలాగే సినిమాలో చాలావరకూ అల్లు అర్జున్‌ లుంగీ, షార్ట్స్‌లోనే కనబడతారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.

చదవండి:
దృశ్యం 2: అజయ్‌ కూడా తప్పించుకుంటాడు
‘అలా నటించడం ఆనందంగా ఉంది’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top