పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు‌ | Fahadh Faasil Villain In Allu Arjun Pushpa Movie | Sakshi
Sakshi News home page

పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు‌

Mar 22 2021 12:22 AM | Updated on Mar 22 2021 12:25 AM

Fahadh Faasil Villain In Allu Arjun Pushpa Movie - Sakshi

‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌  ఎర్నేని, రవి శంకర్‌.వై నిర్మిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పుష్పరాజ్‌ను (అల్లు అర్జున్‌  పాత్ర) ఢీకొట్టే ధీటైన విలన్‌  ఎవరనే ఊహాగానాలకు తెరపడింది.

జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’లో ప్రతినాయకుడిగా నటించనున్నారని మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఫాహద్‌  నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగుతో పాటు ప్యాన్‌ ఇండియా వైడ్‌ కూడా సినీ అభిమానుల్ని అలరించాయి. ఇటీవల ఆయన నటించిన  ‘ట్రాన్స్‌, సీ యూ సూన్‌ ’  సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ‘‘పుష్ప షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement