రఘువరన్‌ బీటెక్‌ టోటల్‌ కలెక్షన్స్‌.. సార్‌ ఫస్ట్‌డేకు వచ్చేస్తాయి! | Producer Naga Vamsi About Sir Movie | Sakshi
Sakshi News home page

రఘువరన్‌ బీటెక్‌ టోటల్‌ కలెక్షన్స్‌.. సార్‌ ఫస్ట్‌డేకు వచ్చేలా ఉన్నాయి

Feb 18 2023 2:24 AM | Updated on Feb 18 2023 8:38 AM

Producer Naga Vamsi About Sir Movie  - Sakshi

‘‘గత ఏడాది మా బ్యానర్‌ నుంచి వచ్చిన ‘భీమ్లానాయక్‌’, ‘డీజే టిల్లు’ సినిమాలకు హౌస్‌ఫుల్‌ అంటూ నాకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఇప్పుడు ‘సార్‌’కు అంత మంచి రెస్పాన్స్‌ వస్తుండడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. ధనుష్‌ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.

అదే రోజు సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ధనుష్ గారి ‘రఘువరన్‌ బీటెక్‌’ మొత్తంగా తెలుగులో ఎంత వసూలు చేసిందో ఆ స్థాయి వసూళ్లు ‘సార్‌’ తొలి రోజునే వచ్చేలా ఉన్నాయి. ఆయన కెరీర్‌లో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టేలా ఉంది’’ అన్నారు. ‘‘ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను చూసిన చుట్టుపక్కల ఘటనల ఆధారంగా ఈ చిత్రకథ రాశాను’’ అన్నారు వెంకీ అట్లూరి.

Advertisement
 
Advertisement
Advertisement