సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. 'ప్రేమతో.. జీ తెలుగు'! | Prematho Zee Telugu Brand Film Details | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. 'ప్రేమతో.. జీ తెలుగు'!

Jun 9 2025 11:35 AM | Updated on Jun 9 2025 12:05 PM

Prematho Zee Telugu Brand Film Details

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్‌లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంఘమంలో నిలుస్తుంది.  

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి.. సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో.. జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించారు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను హత్తుకుంటోంది.

ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. 'ప్రేమతో.. జీ తెలుగు' క్యాంపెయిన్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జీ తెలుగు ఎప్పుడు ముందుంటుంది. మన వివాహ పద్ధతిలోని సౌందర్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు సంస్కృతి, విలువలు, ఆచారాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం రీబ్రాండింగ్ మాత్రమే కాదు, ప్రేక్షకులతో జీ తెలుగు అనుబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు నూతన ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement