Prema Kosam Song : మంగ్లీ పాడిన 'ప్రేమ కోసం' మాస్‌ సాంగ్‌ విన్నారా?

Prema Kosam Song From Bhaag Saale Released - Sakshi

శ్రీ సింహా, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ సాయి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ప్రేమ కోసం..’ అనే మాస్‌ పాటను విడుదల చేశారు. ‘సన్‌ లైటు.. మూన్‌ లైటు.. మించిందేరా లవ్‌ లైటూ, వద్దు చాటు.. వద్దు లేటు.. ఉంటే చాలు కొంత చోటు...’ అంటూ సాగే ఈ  పాటకి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా, మంగ్లీ  పాడారు.

ఈ పాటలో నటి నందినీ రాయ్‌ నర్తించారు. ‘‘ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌ చేసే కథతో రూపొందిన చిత్రం ‘భాగ్‌ సాలే’. యువతని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని ప్రణీత్‌ సాయి తెరకెక్కించారు’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమేష్‌ కుషేందర్‌.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top