ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా? | Prashanth Neel's Bagheera Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

Bagheera Trailer: 'కేజీఎఫ్' స్టైల్లోనే 'బఘీర'.. ట్రైలర్ రిలీజ్

Oct 21 2024 9:49 AM | Updated on Oct 21 2024 11:22 AM

Prashanth Neel's Bagheera Movie Telugu Trailer

'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో)

Advertisement
 
Advertisement
Advertisement