Viral Video: Actress Pragathi Dancing For Pushpa Oo Antava Oo Oo Antava Song - Sakshi
Sakshi News home page

Pragathi Dance Video: ఊ అంటావా మావా.. పాట‌కు ప్ర‌గ‌తి స్టెప్పులు, వీడియో వైర‌ల్‌

Jan 17 2022 12:18 PM | Updated on Jan 17 2022 1:35 PM

Pragathi Dance For Oo Antava Oo Oo Antava Song, Video Goes Viral - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం పుష్ప‌: ద రైజ్‌. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లో విడుద‌ద‌లైంది. సినిమా రిలీజై నెల రోజులు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంది. సినిమానే కాదు ఇందులోని పాట‌లు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి.

'చూపే బంగార‌మాయెనా శ్రీవ‌ల్లీ..', 'సామీ నా సామీ..', 'ఏ బిడ్డా ఇది నా అడ్డా', 'దాక్కో దాక్కో మేక‌..', 'ఊ అంటావా మావా..ఉఊ అంటావా మావా..' పాట‌లు ఇప్ప‌టికీ మార్మోగుతున్నాయి. సౌత్ నుంచి నార్త్ దాకా ఎక్క‌డ చూసినా ఇవే పాట‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సెల‌బ్రిటీలు, టీమిండియా క్రికెట‌ర్లు కూడా ఈ పాట‌ల‌కు స్టెప్పులేస్తూ సంద‌డి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నిత్యం జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసే సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి తాజాగా 'ఊ అంటావా మావా..' సాంగ్‌కు త‌న‌దైన స్టైల్‌లో డ్యాన్స్ చేసింది. అది కూడా జిమ్‌లోనే స్టెప్పులేయ‌డం విశేషం. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా అది కాస్తా హ‌ల్‌చ‌ల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement